- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడి
టెల్ అవీవ్: లెబనాన్లో పేజర్ దాడులకు తాను అనుమతి ఇచ్చానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకున్నారు. ఈ విష యాన్ని ప్రధాని ఆదివారం స్పష్టం చేశారని నెతన్యాహు ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాకు వెల్లడించారు. సెప్టెంబరు 17, 18న లెబనాన్లో వేలసంఖ్యలో పేజర్లు పేలి 40 మంది హెజ్బొల్లా మెంబర్లు చనిపోయారు. 3 వేల మంది గాయపడ్డారు. కొంత మందికి చేతివేళ్లు తెగిపోయాయి.
మరి కొంతమంది కంటిచూపును కోల్పోయారు. తన కమ్యూనికేషన్ల నెట్వర్క్ను ఉల్లంఘించి ఇజ్రాయెల్ ఆ దాడికి పాల్పడిందని హెజ్బొల్లా పేర్కొంది. అలాగే, ఈ దాడులపై యునైటెడ్ నేషన్స్ లేబర్ ఏజెన్సీకి లెబనాన్ గతవారం ఫిర్యాదు చేసింది. తమ దేశ ప్రజలపై ఇజ్రాయె ల్ యుద్ధం చేస్తోందని ఆ ఫిర్యాదు లో లెబనాన్ ఆరోపించింది. కాగా.. నిరుడు అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ టెర్రరిస్టులు దాడిచేసి కొన్ని వందల మందిని చంపివేశారు. చాలా మందిని బందీలుగా పెట్టుకున్నారు.