ఇవాళ మేడారానికి పగిడిద్దరాజు

గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజు నేడు బయలుదేరనున్నాడు.  సమ్మక్క భర్త, సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం యాపలగడ్డ. ఇక్కడి నుంచి పగిడిద్దరాజు ములుగు జిల్లాలోని మేడారానికి చేరుకుంటేనే జాతరకు బీజం పడుతుంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–-సారలమ్మ మహా జాతరకు అరేం వంశానికి చెందిన పగిడిద్దరాజును యాపలగడ్డ గ్రామానికి చెందిన ఆ వంశీయులు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుండగా పగిడిద్దరాజును సోమవారం యాపలగడ్డ నుంచి మేడారానికి కాలినడకన తీసుకెళ్లనున్నారు.