టాలీవడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయిత్ ఇప్పటికే మంచు మనోజ్ మరియు మోహన్ బాబు ఒకరికొకరు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదురినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ విషయంపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ గురువ రెడ్డి స్పందించారు. ఇందులోభాగంగా మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చెయ్యలేదని తెలిపాడు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తదితరుల పేర్లు లేవని స్పష్టం చేశారు. అయితే తాను ఇంట్లో ఉన్న సమయంలో పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అరిచారనీ, అలాగే తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు.
అయితే తనపై దాడి చేసిన వ్యక్తులను పట్టుకునే క్రమంలో మనోజ్ కి గాయాలయ్యాయని తెలిపాడు. తనపై దాడి చేసిన వారి వివరాలు చెప్పలేదని కానీ తన కుటుంబ సభ్యులకు థ్రెట్ ఉందని పోలీసులకి మనోజ్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఘటన జరిగిన తర్వాత కిరణ్ రెడ్డి విజయ రెడ్డి అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని మనోజ్ పోలీసుల విచారణలో చెప్పాడు.
100 కి డయల్ చేయగానే మేము రెస్పాండ్ అయ్యి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించామని కానీ తాము వెళ్లేసరికి మనోజ్ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు లేరని వెల్లడించారు. దీంతో ఈ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.