
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడిపై, 26 మందిని నిర్ధాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న ఘటనపై పాకిస్తాన్ మాజీ సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ పిచ్చి కూతలు కూశాడు. అడ్డూ అదుపూ లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడాడు. ‘‘ఇండియన్ ఆర్మీ యూజ్లెస్’’ అని భారత సైన్యంపై అవాకులుచవాకులు పేలాడు. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రను నిరూపించాలని డిమాండ్ చేశాడు.
ఇండియాలో ఒక క్రాకర్ పేలినా అందుకు కారణం పాకిస్తాన్ అని భారతీయులు నిందిస్తారని వాపోయాడు. కశ్మీర్లో 8 లక్షల సమర్థవంతమైన సైన్యం ఉందని భారత్ చెప్పుకుంటుందని, అయినప్పటికీ పహల్గాం ఘటన జరిగిందని షాహిద్ అఫ్రీదీ వ్యాఖ్యానించాడు. అంటే.. ఇండియన్ ఆర్మీ యూజ్లెస్ అనేగా దీని అర్థం అని వ్యాఖ్యానించిన అఫ్రీదీ.. దేశ ప్రజలకు కనీస రక్షణ కల్పించలేని స్థితిలో భారత సైన్యం ఉందని ఎద్దేవా చేశాడు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ సమా టీవీ ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రీదీ ఈ దురుసు వ్యాఖ్యలు చేశాడు.
Shahid Afridi said “India made blunders in #Pahalgam and then swiftly blamed Pakistan for it. Islam teaches us peace only and Pakistan never supports such kinds of acts. Indians should blame themselves for this” 🇵🇰🇮🇳🤯
— Farid Khan (@_FaridKhan) April 28, 2025
pic.twitter.com/NZZ1uRlslF
పహల్గాంలో ఘోర తప్పిదాలు ఇండియా చేసి.. పాకిస్తాన్పై నిందలు వేస్తున్నారని అఫ్రీదీ అన్నాడు. ఇస్లాం తమకు శాంతిని మాత్రమే బోధించిందని, పాకిస్తాన్ అలాంటి ఉగ్ర చర్యలకు ఏమాత్రం మద్దతుగా నిలవదని అఫ్రీదీ చెప్పడం కొసమెరుపు. పహల్గాం ఉగ్ర దాడికి భారతీయులు తమను తాము నిందించుకోవాలని అఫ్రీదీ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడూ భారత్తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకే ప్రయత్నించామని షాహీద్ అఫ్రీదీ చెప్పడం గమనార్హం.