మా కొడుకు..మేం గర్వపడేలా చేసిండు.. హార్స్ రైడర్ తండ్రి హైదర్ షా

మా కొడుకు..మేం గర్వపడేలా చేసిండు.. హార్స్ రైడర్ తండ్రి హైదర్ షా
న్యూఢిల్లీ: తాను చనిపోతానని తెలిసి కూడా పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి టెర్రరిస్టుల తూటాలకు బలైన తమ కొడుకు.. తాము గర్వపడేలా చేశాడని పహల్గాం టెర్రర్ అటాక్ లో మృతిచెందిన ఆదిల్ హైదర్ షా తండ్రి హైదర్ షా అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో హార్స్ రైడర్ అయిన స్థానికుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా.. పర్యాటకులపై కాల్పులు జరుపుతున్న ఓ టెర్రరిస్ట్ వద్ద నుంచి తుపాకీని లాక్కొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనిపై టెర్రరిస్టులు తుటాల వర్షం కురిపించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

 ఈ ఘటనపై గురువారం అతని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ‘‘ పెండ్లి చేసుకున్న ఆరు రోజులకే ఓ అమ్మాయి భర్తను కోల్పోయింది. మరో అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. జనాలు తమ పిల్లలను కోల్పోయారు. వారు అమాయకులు. నా కొడుకు వారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. అతను మమ్మల్ని గర్వపడేలా చేశాడు" అని తండ్రి హైదర్ షా అన్నారు. టెర్రరిస్టులు మనుషులు కాదని వారిని, కఠినంగా శిక్షించాలని అన్నారు