
సీమా హైదర్.. ఈమె గురించి మనందరికి తెలుసు..పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి యూపీ యువకుడిని పెళ్లాడిన పాకిస్తాన్ జాతీయురాలు. అప్పట్లో ఈమె ప్రేమ కథ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం పిల్లలు, భర్తతో కలిసి యూపీలో జీవిస్తోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీయులకు భారత్ వీసాలు రద్దు చేయడంతో సీమా హైదర్ పరిస్థితి డైలమాలో పడింది. తనను పాకిస్తాన్ కు పంపిస్తారేమోనని భయపడుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సీమా హైదర్.. ప్రధాని మోదీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు , కేంద్ర హోంశాఖకు ఓ రిక్వెస్ట్ చేసింది..తాను ఒకప్పుడు పాకిస్తాన్ జాతీయురాల్ని.. కానీ ఇప్పుడు భారతీయుల కోడల్ని..నేను మతం మార్చుకొని నా భర్తలో హాయిగా ఉంటున్నాను. దయచేసి నన్ను ఇండియానుంచి పంపించొద్దు అంటూ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీమా హైదర్.. పాకిస్తాన్ లోని సింధుప్రావిన్స్ కు చెందిన మహిళ. సోషల్ మీడియాలో పరిచయమైన ఇండియన్ యువకుడి ప్రేమలోపడింది.. 2023లో సరిహద్దులు దాటి వచ్చి ఆ యువకుడిని పెళ్లి చేసుకుంది.
►ALSO READ | భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు
పిల్లలు, భర్తతో ఇండియాలో కాపురం చేసుకుంటున్న సీమా హైదర్.. పాకిస్తానీయులకు వీసాల రద్దు ప్రకటనతో ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి విజ్ణప్తిచేసింది.
‘‘నేను పాకిస్తాన్ కు వెళ్లాలని అనుకోవడం లేదు. ఇండియాలో ఉంటాను. దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యూపీకి చెందిన మీనా అనే హిందూ వ్యక్తి పెళ్లాడిన సీమా హైదర్.. హిందు మతాన్ని స్వీకరించింది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో సీమా హైదర్ కు కేంద్రం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని ఆమె తరపు న్యాయవాది ఆశాభావం వ్యక్తం చేశారు.