సెల్ఫీ దిగిన టెర్రరిస్టులు..పహల్గాం దాడికి ముందు ఎలా ఉన్నారో చూడండి

సెల్ఫీ దిగిన టెర్రరిస్టులు..పహల్గాం దాడికి ముందు ఎలా ఉన్నారో చూడండి

జమ్మూకాశ్మీర్లోని పహల్గాం అనాగరిక ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులను బుధవారం (ఏప్రిల్ 23) సెక్యూరిటీ ఏజెన్సీలు గుర్తించాయి.  దాడికి ముందు గత నెలరోజులుగా ఈ ప్రాంతంలో ఈ గ్రూప్ యాక్టివ్ ఉందని ఏజెన్సీ తెలిపింది.సోర్స్ ప్రకారం.. దాడికి ముందు వీరు ఫొటో దిగినట్లు ఆ ఫొటో ఓ వ్యక్తి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఊహాచిత్రాలతో మ్యాచ్ కావడంతో ఈ ముగ్గురే దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఫొటో లో ఉన్న నాలుగో వ్యక్తి గతంలో జమ్మూలో జరిగిన ఎన్ కౌంటర్లో హతమయ్యాడు.   

మంగళవారం జరిగిన అనారిక టెర్రరిస్టు దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బైసారన్ వ్యాలీలో భయానక దాడికి పాల్పడిన టెర్రరిస్టులు.. టూరిస్టుల్లో మగవారిని వేరుచేసి..వారి మతం అడిగి మరీ దారుణంగా కాల్చిచంపారు. పిల్లల ముందే వారి తండ్రులను చంపుతుంటే తల్లడిల్లిన పసి హృదయాలు బోరున విలపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్లముందే భర్తను చంపుతుంటే భయంతో వణికిపోయిన భార్యల, విలపిస్తున్న బంధువుల వీడియోలు వైరల్ అయ్యాయి.ఈ దాడులకు పాక్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలే కారణమని భద్రతదళాలు అనుమానిస్తున్నాయి.  

మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు టెర్రరిస్టులు టూరిస్ట్ సైట్ కు వచ్చారని.. తర్వాత టూరిస్టులను జంటలుగా విడదీసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం మగవారిని వేరుచేసి మతం, పేరు అడిగి ఏకే 47 గన్ తో పాయింట్ బ్లాంక్ లో కాల్చి అత్యంత దారుణంగా చంపారని తెలిపారు. 

బుధవారం హోంమంత్రి అమిత్ షా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన 26 మృతులకు పార్థీవదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.హోంమంత్రి భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

పహల్గా ఉగ్రదాడికి లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది.  ఆర్టికల్ 370 రద్దుకు , జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత 2019లో TRF LeT ప్రాక్సీ సంస్థగా ఉనికిలోకి వచ్చింది. సోపోర్, కుప్వారాలలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓవర్ ది గ్రౌండ్ వర్కర్స్ మాడ్యూల్స్ చేధించినప్పుడు TRF ఉగ్రవాద సంస్థ సంకేతాలు కనిపించాయి. అరెస్టయిన OGWs ఈ సంస్థకోసం యువతను ఆకర్షిస్తున్నట్లు తెలిపింది.