
మెదక్, వెలుగు: పహెల్గాం ఉగ్రదాడి కారణంగా శ్రీనగర్లో చిక్కుకుపోయిన 81 మంది తెలంగాణ వాసులు క్షేమంగా సొంతూళ్లకు చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందినవారు అక్కడ చిక్కుకున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడి తర్వాత అక్కడ చిక్కకుపోయిన పర్యాటకులను కేంద్రం సురక్షితంగా సొంతూళ్లకు పంపేందుకు చర్యలు తీసుకుంది. దీంతో శుక్రవారం సాయంత్రం శ్రీనగర్ నుంచి ఫ్లైట్ లో బయలుదేరి శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరారు.