హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ షాక్ఇచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలోనూ పెయిడ్పార్కింగ్ అమలు చేయనుంది. ఈ మేరకు నాగోలు స్టేషన్పార్కింగ్ఏరియాలో బోర్డు ఏర్పాటు చేసింది. ఆగస్టు 25 నుంచి నాగోలులో, సెప్టెంబర్1 నుంచి మియాపూర్ స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ అమలు చేయాలని గతంలో మెట్రో యాజమాన్యం నిర్ణయించగా, ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.
తాజాగా సెప్టెంబర్ 15 నుంచి పెయిడ్పార్కింగ్అమలు చేయనున్నట్లు బోర్డు ఏర్పాటు చేసింది. అయితే పెయిడ్పార్కింగ్ను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్చేస్తూ శుక్రవారం డీవైఎఫ్ఐ, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ సంఘాల నాయకులు మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డిని కలిశారు.