కేంద్రమంత్రిని కలిసిన ఆర్మూర్​ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

కేంద్రమంత్రిని కలిసిన ఆర్మూర్​ఎమ్మెల్యే  పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్​ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మంత్రికి మెమొరాండం ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు కొనసాగిస్తున్న మహాత్మాగాంధీ ఉపాధిహామీ స్కీం నిధులను రాష్ట్రం ప్రభుత్వం వేరే పథకాలను మళ్లిస్తుందని మంత్రికి వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్​రెడ్డి, పాయల్​శంకర్, పాల్వాయి హరీశ్ తదితరులు ఉన్నారు.​