నందిపేట, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి, అక్రమలకు రౌడీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ నాయకులు పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నందిపేట మండలంలోని కంఠంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు రాకేశ్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కంఠం నుంచి గుంజ్లీ వరకు రోడ్డు సరిగ్గా లేక జనాలు అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చారని,ఈ సారి బీజేపీకి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూయిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు భూతం సాయిరెడ్డి, కంఠం సాయికుమార్, పార్టీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.