
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి ఓపీ బ్లాక్ లో అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన పెయిన్ క్లినిక్ ను డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్, గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ఆర్ఎంఓ డా.శేషాద్రి, విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఆవుల మురళీధర్ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ క్లినిక్ సోమవారుం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయన్స్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.