దాన కర్ణుడు అంటున్నావ్..! పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కర్ణుడు ఏంటి అనుకోకండి. తోటి ఆటగాడిలో మనో ధైర్యం కల్పించడానికి ఒక పాక్ క్రికెటర్ చేసిన ప్రకటనే అతన్ని ఆ స్థాయిలో మన్ననలు పొందేలా చేస్తోంది. ఇదంతా నేను చెప్తున్నది కాదు.. అక్కడి మీడియా చేస్తున్న హంగామా!
పాకిస్తాన్ పేసర్ నసీం షా భుజం గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. మెగా టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజారుతున్నందున నసీం షా ట్విట్టర్ వేదికగా భావోద్వేగ ప్రకటన చేశాడు.
"దేశానికి ప్రాతినిధ్యం వహించే ఈ అద్భుతమైన అవకాశం కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. నేను నిరాశకు గురైనప్పటికీ, ప్రతిదీ అల్లా చేతుల్లో ఉందని నేను నమ్ముతున్నాను. ఇన్షా అల్లా.. త్వరలో మైదానంలోకి వస్తాను. నా క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు!.." అని షా ట్వీట్ చేశారు. అందుకు బదులిచ్చిన పాక్ యువ క్రికెటర్ మహ్మద్ హారిస్.. అవసరమైతే నసీం షాకు తన భుజం ఇస్తానని ట్వీట్ చేశాడు.
"నసీమ్ మేరా భుజం లేలే.." అని హారిస్ చేసిన ట్వీట్‌పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇది ఒకరకంగా ఓవర్ యాక్షన్ అని మనకు అనిపించినప్పటికీ.. అక్కడి మీడియా మాత్రం హారిస్ ను దయాగుణుడు అన్నట్లు కీర్తిస్తోంది. అందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Stay strong dost ❤️ pic.twitter.com/SWSKscGpdq
— Muhammad Haris (@iamharis63) September 22, 2023
వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ.