
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ దాడి తరువాత భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో భాగంగా ఇండియాలో ఉండే పాక్ పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాపై ఉన్నవారు కూడా వెళ్లిపోవాలని నిర్దేశిత గడువు ప్రకటించింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో నివసిస్తున్న ఓ కుటుబం చిక్కుల్లో పడింది. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సభ్యులుండగా ఇద్దరికి భారతీయ పౌరసత్వం... మరో ఇద్దరికి పాకిస్తాన్ పౌరసత్వం కలిగి ఉంది. తండ్రీ .. పెద్దకుమారుడికి పాక్ పౌరసత్వం.. తల్లి చిన్న కుమారుడికి ఇండి పౌరసత్వం కలిగిఉంది.
పెద్దకుమారుడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడని .. విశాఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తమ కుటుంబాన్ని వెనక్కు పంపవద్దని నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చీని కోరారు. దీర్ఘకాల వీసా కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నామని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. కాబట్టి తమను వెనక్కి పంపకుండా చూడాలని కోరారు. స్పందించిన సీపీ.. వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆ కుటుంబాన్ని పంపించారు.
►ALSO READ | నిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..
ఆ బాలుడి తల్లి గుంటూరుకు చెందిన దంతవైద్యురాలు, ఆమెకు భారతీయ పాస్‌పోర్ట్ ఉంది . విశాఖపట్నంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబం నగరంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది.