మీ గొంతు కోస్తా..! ఇండియన్లకు పాక్ ఆఫీసర్ బెదిరింపు సైగ

మీ గొంతు కోస్తా..! ఇండియన్లకు పాక్ ఆఫీసర్ బెదిరింపు సైగ

లండన్: పహల్గాం దాడిని ఖండిస్తూ లండన్‌‌‌‌లోని పాకిస్తాన్ హైకమిషన్ బయట ఇండియన్లు శుక్రవారం నిరసన చేపట్టారు. అయితే, అక్కడే ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్.. తన చేతితో "మీ గొంతు కోస్తా" అని నిరసనకారుల వైపు కోపంగా చూస్తూ బెదిరింపు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

లండన్‌‌‌‌లోని పాకిస్తాన్ హైకమిషన్ బయట ఇండియన్లు పహల్గాం దాడిని ఖండిస్తూ నిరసన చేస్తున్నారు. భారత త్రివర్ణ జెండాలు పట్టుకుని ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు బ్యానర్‌‌‌‌లు ప్రదర్శించారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలకు మద్దతిస్తూ టెర్రరిస్టులకు ఆశ్రయమిస్తోందని ఆరోపించారు. అదేటైంలో కర్నల్ తైమూర్ రహత్.. హైకమిషన్ బాల్కనీలో "పాకిస్తాన్ కాశ్మీరీలతో ఉంది" అనే బ్యానర్ పక్కన నిలబడి ఉన్నాడు. భారత వైమానిక దళ ఆఫీసర్ అభినందన్ వర్థమాన్‌‌‌‌ను ఎగతాళి చేస్తూ పోస్టర్‌‌‌‌ను ప్రదర్శించాడు. నిరసనకారులను సైగలతో బెదిరించాడు.