పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లాహోర్ నుంచి కరాచీకి బయలుదేరిన విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది. విమానంలో సాంకేతిక సమస్య వచ్చిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు తెలియజేశాడు. ఇంజిన్ పాడైనా కూడా ఎలాగో అలాగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి పైలట్ రెండు మూడు సార్లు ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యపడలేదు. దాంతో పైలెట్ మళ్లీ విమానాన్ని పైకి తీసుకెళ్లాడు. మళ్లీ ఏటీసీ సిబ్బందిని పైలట్ అప్రమత్తం చేశాడు. దాంతో ఏటీసీ సిబ్బంది ఫ్లైట్ ల్యాండవడానికి రెండు రన్ వేలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రన్ వే మీద విమానాన్ని ల్యాండింగ్ చేయాలని ఏటీసీ సిబ్బంది పైలట్‌ని కోరారు. కానీ, అప్పటికే విమానం పూర్తిగా కంట్రోల్ తప్పింది. దాంతో పైలట్ ఏటీసీకి ప్రాణాపాయ స్థితిలో చెప్పే కోడ్ వర్డ్…. మే డే.. మే డే.. మే డే.. అని మూడు సార్లు చెప్పాడు. ఆ తర్వాత ఏటీసీతో విమానానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ సంభాషణ అంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్‌లో రికార్డ్ అయ్యింది. కొన్ని క్షణాల్లోనే విమానం ఓ సెల్ ఫోన్ టవర్‌ను ఢీకొట్టి.. మోడల్ కాలనీలో కూలిపోయింది.
For More News..