ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయక తప్పదా?

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురు దెబ్బతగిలింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)  మిత్రపక్షమైన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM) ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఎంక్యూఎం ఒప్పందానికి సంబంధించిన వివరాలను రేపు చెబుతామని PPP ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు. ఎంక్యూఎం షాకివ్వడంతో అక్కడి అసెంబ్లీలో  ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ తగ్గిపోనుంది.

ఎంక్యూఎంపీ సభ్యులురాజీనామా చేస్తే   ఇమ్రాన్ ఖాన్  ప్రభుత్వ బలం 164 కు తగ్గుతుంది. ప్రతిపక్షాల బలం  177 కి పెరగనుంది. పాకిస్తానీ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 172.  ప్రధానిపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే.. ప్రతిపక్షానికి 172 సభ్యుల మద్దతు అవసరం. రేపు (మార్చి31) ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరగనుంది. అయితే అసెంబ్లీలో మెజారిటీ తక్కువగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఇవాళ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.