మద్యం కేసులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సవతి కొడుకును (ఇమ్రాన్ భార్య బుష్రా బిబూకు ఆమె మొదటి భర్తకు పుట్టిన కుమారుడు) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత భార్య బుష్రా బిబూ కుమారుడు మూసా మనేకా మరో ఇద్దరు స్నేహితులు కారులో మద్యం బాటిళ్లు తరలిస్తుండగా లాహోర్ లోని గడాఫీ స్టేడియం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు వాళ్లను గంటలోపే విడిచిపెట్టారు. వాళ్ల కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తిగత పూచీకత్తు, న్యాయపరమైన ప్రక్రియ తర్వాత రిలీజ్ చేసినట్లు చెప్పారు.
తనిఖీల సమయంలో మూసా మనేకా తమను బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. తాను పాక్ ప్రథమ మహిళ కుమారుడిని అని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామలు ఎదురవుతాయని బెదించాడని అన్నారు. కానీ పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నతాధికారులు పంజాబ్ పోలీస్ చీఫ్ కు ఫోన్ చేయడంతో ఎటువంటి న్యాయపరమైన చర్యలు లేకుండానే వాళ్లను గంటలోపే విడుదల చేశామని చెప్పారు. పాక్ లో మద్యం అమ్మడం,సేవించడం చట్టరిత్యా నేరం.
మరిన్ని వార్తల కోసం