
- సుచీంద్రకుమార్ అరెస్టు అయ్యారంటూ పోస్ట్ లు
- ఇవాళ పదవీ విరమణ చేస్తున్న అధికారి
ఢిల్లీ: పాకిస్తాన్ సోషల్ మీడియా మరోసారి బరిదెగించింది. కట్టుకథలు, తప్పుడు వార్తలతో విషం చిమ్మింది. పహల్గాం ఉగ్రదాడి వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్రకుమార్ను ఆ పదవి నుంచి తొలగించారంటూ పాక్ అనుకూల సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేశారు.
మరికొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో అతడిని అరెస్టు కూడా చేశారంటూ రాసుకొచ్చారు. అయితే ఆ ప్రచారాన్ని భారత్ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలుగా స్పష్టం చేసింది. నిజానికి ఆయన ఇవాళ పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపింది. ఆయన స్థానంలో కొత్తగా లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫాక్ట్ చెక్ వెల్లడించింది.