ఇంటి పన్ను కట్టలేదని బ్యాంక్ వాళ్లు ఇంట్లో సామానులు వేలం వేయటం చూశాం.. బ్యాంకు అప్పు కట్టలేదని ఇంటిని వేలం వేయటం చూశాం.. పాకిస్తాన్ ఇప్పుడు కొత్త టెక్నిక్ ఫాలో అవుతుంది. టెక్నాలజీ యుగానికి తగ్గట్టు కొత్త ఐడియాలతో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది. అదేంటో తెలుసా.. పన్నులు కట్టలేదని 5 లక్షల మందికి చెందిన సెల్ ఫోన్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసింది.. దీంతో జనం షాక్ అయ్యారు. పొద్దున నిద్ర లేచిన తర్వాత మన తమ మొబైల్ ఫోన్లు పని చేయటం లేదని గగ్గోలు పెట్టిన వారికి.. షాకింగ్ విషయం తెలిసి షాక్ అయ్యారు..
పన్ను ఎగవేతదారులపై తీసుకునే చర్యలో భాగంగా అర మిలియన్లకు పైగా పన్ను ఎగవేతదారుల మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేయాలని పాకిస్తాన్ అధికారులు నిర్ణయించారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఆదాయపు పన్ను జనరల్ ఆర్డర్ (ITGO)లో 2023కి సంబంధించి పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడంలో విఫలమైన 5 లక్షల 6 వేల 671 మంది మొబైల్ సిమ్‌లను బ్లాక్ చేయబడతాయని తెలిపింది. వారు పన్ను కట్టేంత వరకు ఈ బ్లాక్ నిషేదం ఉంటుందని వెల్లడించింది. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ, అన్ని టెలికాం సంస్థలు వారి సిమ్‌లను బ్లాక్ చేయడానికి మే 15 లోపు గడువు విధిస్తున్నట్టు తెలిపింది.
అయితే ప్రతి సోమవారం, FBR దాని ATL జాబితాలను అప్‌డేట్ చేస్తుంది. ప్రతి మంగళవారం, ATL జాబితాలో కనిపించే వ్యక్తుల పేర్లు గుర్తించబడతాయి. అలా వచ్చిన పేర్ల వ్యక్తుల సిమ్ లు పునరుద్ధరించబడతాయని అధికారులు వెల్లడించారు.