వరల్డ్ కప్ ఓటముల నుంచి పాకిస్తాన్ క్రికెటర్లు తేరుకున్నట్లు కనిపిస్తున్నారు. కొత్త కోచ్, కొత్త కెప్టెన్లు వచ్చేసరికి ఆటగాళ్లలో ఎక్కడలేని సంతోషం కనిపిస్తోంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లందరూ ఒక్కచోట చేరి నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఈ క్రమంలో కొన్ని సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
డిసెంబర్ 14 నుంచి పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జట్టును ప్రకటించగా.. ఆటగాళ్లందరూ ఒక్కచోట చేరి శిక్షణ మొదలుపెట్టారు. పటిష్ట ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ సెషన్‌కు సహచర ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు పూయించాడు. స్లిప్ -క్యాచెస్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాబర్.. ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ 'చోటా డాన్' (లిటిల్ డాన్) అంటూ ఆట పట్టించాడు. అందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
From now on, Saud Shakeel is a chota don. Babar gave a new nickname to Saud Shakeel. ??#BabarAzam? #SaudShakeel pic.twitter.com/xcNRf8flkz
— Shaharyar Ejaz ? (@SharyOfficial) November 23, 2023
చోటా డాన్
బాబర్ ఏ ముహూర్తాన అలా పిలిచాడో కానీ, మిగిలిన ఆటగాళ్లు కూడా అతన్ని అలానే పిలిస్తున్నారట. కొందరు అందులో సగం కట్ చేసి చోటా అని హేళన చేస్తున్నారట. ఆ విషయాలన్నింటినీ సౌద్ షకీల్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్థాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వాసిమ్ జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్ మరియు షాహీన్ షా అఫ్రిది.