తనకంటే తక్కువ స్థాయి జట్లయిన నెదర్లాండ్స్, ఆఫ్గనిస్తాన్ ప్రపంచ కప్‌లో సంచలనాలు సృష్టిస్తున్న బంగ్లా ఆటగాళ్లలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. పాక్ పేసర్లు షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, వసీం జూనియర్ చెలరేగడంతో 45.1 ఓవర్లలో 204 పరుగులకే కుప్పకూలారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా ఓపెనర్ తాంజిద్ హసన్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడినుండి బంగ్లాదేశ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(56; 70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా, లిట్టన్ దాస్(45), షకిబ్ అల్ హసన్ (43) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 2, ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ పడగొట్టారు.
Pacers run riot in Kolkata ?@Wasim_Jnr cleans up the tail after @iShaheenAfridi became the joint-leading wicket-taker in the tournament ?#PAKvBAN | #CWC23 | #DattKePakistani pic.twitter.com/AWrhfTtnij
— Pakistan Cricket (@TheRealPCB) October 31, 2023