వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. మొదట బంగ్లాను 204 పరుగులకే కట్టడి చేసిన పాక్ ఆటగాళ్లు.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. ఈ గెలుపుతో పాక్ వరుస ఓటములకు బ్రేక్ వేయడమే కాకుండా.. పాయింట్ల పట్టికలో అఫ్గానిస్తాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి దూసుకొచ్చింది.
బంగ్లాదేశ్ నిర్ధేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పాక్ 3 వికెట్లు కోల్పోయి మరో 105 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఛేదనలో పాక్ ఓపెనర్లు ఫకర్ జమాన్ (81; 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు), అబ్దుల్లా షఫీక్ ( 68; 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ విజయంతో పాక్.. పాయింట్ల పట్టికలో అఫ్గానిస్తాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి దూసుకొచ్చింది.
అంతకుముందు పాక్ పేసర్లు షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, వసీం జూనియర్ చెలరేగడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(56; 70 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా, లిట్టన్ దాస్(45), షకిబ్ అల్ హసన్ (43) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 2, ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ చెరో వికెట్ పడగొట్టారు.
Pakistan win by seven wickets and 105 balls to spare! ?@iMRizwanPak and @IftiMania give the finishing touches after brilliant knocks by the openers ?#PAKvBAN | #CWC23 | #DattKePakistani pic.twitter.com/qmKwP26G8H
— Pakistan Cricket (@TheRealPCB) October 31, 2023