వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది అరుదైన ఘనత సాధించాడు. బంగ్లా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే తాంజిద్ హసన్‌ను పెవిలియన్ చేర్చిన అఫ్రిది.. 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. తద్వారా తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లు
- సందీప్ లమిచానే(నేపాల్): 42 మ్యాచ్‌లు
- రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్): 44 మ్యాచ్‌లు
- షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్): 51 మ్యాచ్‌లు
- మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా): 52 మ్యాచ్‌లు
- సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్): 53 మ్యాచ్‌లు
Shaheen Afridi becomes the fastest pacer to reach 1️⃣0️⃣0️⃣ ODI wickets. ?#ShaheenAfridi #PAKvBAN #CWC23 #Sportskeeda pic.twitter.com/k2oyQnSYPi
— Sportskeeda (@Sportskeeda) October 31, 2023