రావల్పిండి : స్పిన్నర్లు నోమన్ అలీ (6/42), సాజిద్ ఖాన్ (4/69) చెలరేగడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్ట్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఇచ్చిన 36 రన్స్ టార్గెట్‌ను పాక్ 3.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది. అంతకుముందు 24/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో 112 రన్స్‌కు ఆలౌటైంది. పాక్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. 1987లో లాహోర్‌లో 130 రన్స్‌కు ఆలౌటైంది. జో రూట్ (36) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సౌద్ షకీల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సాజిద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.