పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి(గురువారం, ఏప్రిల్ 18) నుంచి ప్రారంభం కానుంది. మొదటి మూడు టీ20లు రావల్పిండిలో జరగనుండగా, చివరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌తో బాబర్ అజామ్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు ప్రారంభించనున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం బాబర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. అతని స్థానంలో టెస్టులకు షాన్ మసూద్‌ను, టీ20లకు షాహీన్ అఫ్రిదీని కెప్టెన్లుగా పీసీబీ ప్రకటించింది.
ఈ సిరీస్‌తో పాక్ మాజీ ఆటగాళ్లు మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారు. జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు రావడంతో వీరిద్దరు తమ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరోవైపు కీలక ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో బిజీగా ఉండడంతో.. కివీస్ జట్టు ద్వితీయ శ్రేణి ప్లేయర్లతో బరిలోకి దిగుతోంది.
న్యూజిలాండ్ vs పాకిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
- నాలుగో టీ20: ఏప్రిల్ 25 (గడాఫీ స్టేడియం, లాహోర్)
- ఇదో టీ20: ఏప్రిల్ 27 (గడాఫీ స్టేడియం, లాహోర్)
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశంలో ఈ మ్యాచ్ లు ఏ టీవీ ఛానెల్‌లోనూ ప్రదర్శించబడవు. క్రికెట్ అభిమానులు చూడాలనుకుంటే.. FanCode యాప్వె మరియు బ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. అందుకు 89 రూపాయలు చెల్లించి టూర్ పాస్ తీసుకోవాలి.
పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), సయీమ్ అయూబ్, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అబ్రార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ నియాజీ, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్.
న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాంచీ, జాక్ ఫౌల్క్స్, జిమ్మీ నీషమ్, విల్ ఓరూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సోది.