చోకర్స్, సెమీస్ వరకే ఆ జట్టు.. ఇవి వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ముందు దక్షణాఫ్రికా జట్టు గురుంచి మాజీలు, విమర్శకులు అన్న మాటలు. కానీ వారి మాటలు తప్పని నిరూపిస్తున్నారు.. సఫారీ ఆటగాళ్లు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి టైటిల్ రేసులో అందరికంటే ముందున్నారు.
నెదర్లాండ్స్ చేతిలో ఓటమి, పాకిస్తాన్‌పై వికెట్ తేడాతో గెలుపు మినహా మిగిలిన అన్ని మ్యాల్లోనూ ప్రోటీస్ జట్టు అద్భుతంగా ఆడింది. శ్రీలంకపై 102 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై 134, ఇంగ్లాండ్‌పై 229, బంగ్లాదేశ్‌పై 149.. ఇలా అన్నీ భారీ విజయాలే. మొదట బ్యాటింగ్ చేస్తే చాలు సఫారీ బ్యాటర్లు అలవోకగా మూడొందలు బాధేస్తున్నారు. అదే చివరి 10 ఓవర్లలో అయితే బౌలర్లను చెడుగుడు ఆడుకుంటున్నారు. ఈ విజయాన్నిటికీ ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా కారణమట. అతడు ఆడకపోయినా.. జట్టులో ఉంటే చాలు విజయం వారినే వరిస్తుందట. ఈ మాటలు చెప్తున్నది మరెవరో కాదు.. ట్రోలర్స్.
మైదానంలో సఫారి బ్యాటర్లు.. ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఎలా ఆడేసుకుంటున్నారో, సోషల్ మీడియాలో ట్రోలర్స్.. బవుమాను అలా ఆడుకుంటున్నారు. నాలుగు అడుగుల బుల్లెట్ అంటూ అతన్ని హేళన చేస్తున్నారు. మరికొందరైతే అతన్ని.. ది మ్యాన్, ది మైత్, ది లెజెండ్.. అంటూ వెటకారపు పొగడ్తలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్లు నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి.
Temba Bavuma in this world cup.#PAKvsSA pic.twitter.com/jvOyhXjLMN
— Rajabets ??? (@smileagainraja) October 27, 2023
Adidha Fire ?
— త్రిపాఠి మహాసేన (@Tripathi0611) October 28, 2023
Temba Bavuma fans ikkada?pic.twitter.com/zJP1RsAL0E
Temba Bavuma might be struggling for a few runs in #CWC23 but he's definitely not lacking any confidence when it comes to leading this team. The culture he and Rob has built over the past 6 months is incredible. Let's take learning from this game. We move. WELL DONE SKIP ? pic.twitter.com/dFiO6ldK2n
— Lawrence Bailey ⚪ ?? (@LawrenceBailey0) October 27, 2023
సౌతాఫ్రికా తదుపరి మ్యాచ్‌లు
- నవంబర్ 1: న్యూజిలాండ్‍తో,
- నవంబర్ 5: ఇండియాతో,
- నవంబర్ 10: ఆఫ్ఘనిస్తాన్‌తో..
ALSO READ :ఇప్పుడైతే సచిన్ 200 సెంచరీలు చేస్తాడు.. కోహ్లీకి భారత మాజీ బౌలర్ కౌంటర్