భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పలు  జిల్లాల్లో  వాగులు వంకలు పొంగిపోతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక   మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో  భారీ వర్షం పడింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి   గార్ల మండలంలో పాకాల వాగు పొంగి ప్రవహిస్తోంది. పాకాలవాగుపై ఉన్న చెక్ డ్యాం నుంచి పరవళ్ళు  తొక్కుతోంది.  

 పాకాల వాగు  చెక్ డ్యాం పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో  గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాల మధ్య  రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా  వాహనాలు నిలిచిపోయాయి. పాకలవాగును చూడడానికి జనం తరలివస్తున్నారు. అటు వైపు  వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.