
పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుంది. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ లో ఒక ఐసీసీ టోర్నీని నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే పాకిస్థాన్ ఐసీసీ ఈవెంట్ లను నిర్వహించడం పట్ల ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు చూడటానికి హాజరవుతున్న విదేశీ అతిథులను కిడ్నాప్ చేయడానికి "యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు" కుట్ర పన్నుతున్నాయని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానం వ్యక్తం చేసింది. దీంతో భద్రతా దళాలను హెచ్చరిస్తూ హై అలర్ట్ జారీ చేసింది.
తెహ్రిక్-ఇ తాలిబన్ పాకిస్తాన్, ISIS, బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలపై హెచ్చరిక జారీ చేయబడిందని సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ భద్రతా దళాలు.. ఆటగాళ్లు, వారితో పాటు ఉన్న సిబ్బందికి హై సెక్యూరిటీ అందిస్తున్నాయట. 2024లో షాంగ్లాలో చైనా ఇంజనీర్లపై దాడి, 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై కాల్పులు వంటి సంఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ALSO READ : Champions Trophy 2025: మా పనైపోయింది.. సెమీస్ ఆశలు వదిలేసుకున్న పాకిస్థాన్ కెప్టెన్
భద్రతా కారణాలను చూపుతూ భారతక్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఫిబ్రవరి 19 న ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ మార్చి 9 వరకు జరుగుతుంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 24) గ్రూప్ ఏ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆతిధ్య పాకిస్థాన్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. మరోవైపు భారత్ రెండు విజయాలతో సెమీస్ కు దగ్గరైంది.