పెషావర్: పాకిస్తాన్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని సెక్యూరిటీ చెక్ పోస్టుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అఫ్గాన్ బార్డర్ మకీన్లోని లిటా సర్‌లో ఉన్న చెక్ పోస్టుపై దాడిచేశారు. ఈ ఘటనలో16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో భద్రతాబలగాలపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది.