అండర్ వరల్డ్ డాన్ తో బ్రేకప్.. పెళ్లికి అలాంటి వరుడు కావాలంటున్న హీరోయిన్..

అండర్ వరల్డ్ డాన్ తో బ్రేకప్.. పెళ్లికి అలాంటి వరుడు కావాలంటున్న హీరోయిన్..

పాకిస్థాన్ నటి మెహ్విష్ హయత్‌ ఓ ఇంటర్వ్యూలో తనకి కాబోయే భర్త, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులోభాగంగా తాను ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి  రెడీ కాబోతున్నట్లు తెలిపింది. అలాగే తన ఇంట్లోవాళ్ళు కూడా పెళ్ళికి తొందరపెడుతున్నారని దాంతో త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మెహ్విష్ హయత్‌ చెప్పుకొచ్చింది.

ఇక తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలనే విషయంపై స్పందిస్తూ తన కుటుంబ సభ్యులని అర్థం చేసుకుని సులభంగా కలసిపోయే తత్త్వం ఉండాలని, అలాగే మనుషులతో ప్రేమగా మెలిగే మనస్తత్వం ఉండాలని తెలిపింది.

ALSO READ | హక తో మళ్లీ దద్దరిల్లిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ పార్లమెంటు

మెహ్విష్ హయత్‌ 2019లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. అంతేగాకుండా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఇప్పుడు మెహ్విష్ హయత్‌ పెళ్లికోసం వరుడిని వెతుకుతున్నానని చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా మెహ్విష్ హయత్‌ గత ఏడాది పాకిస్థానీ డైరెక్టర్ నబీల్ ఖురేషి డైరెక్ట్ చేసిన తేరి మేరి కహానీయాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతో కొత్త సినిమాల సమాచారం లేదు.