ఉగ్ర సంస్థలకు మా మద్దతు ఉంది..పాకిస్తాన్ రక్షణ మంత్రి వీడియో వైరల్

ఉగ్ర సంస్థలకు మా మద్దతు ఉంది..పాకిస్తాన్ రక్షణ మంత్రి వీడియో వైరల్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి  ఖ్వాజా ఆసిఫ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి స్కై న్యూస్ తో మాట్లాడుతున్న చూపించే ఈ వీడియో వైరల్ గా మారింది. మేం సుమారు 3దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ  ఈ వీడియాలో ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు.

పాకిస్తాన్‌ కుట్ర బయటపెట్టిన ఖ్వాజా ఆసిఫ్

సోవియట్ యూనియన్ యుద్ధంలో, భారత్ లో జరిగిన 9/11 దాడుల్లో పాల్పంచుకోకపోతే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేదని ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. పహల్గాం దాడులకు పాకిస్తాన్ కుట్రపన్నిందని ఆరోపిస్తుంది..దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగేలా ఉందని పాక్ రక్షణ మంత్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

పాక్ పై భారత్ ఉక్కుపాదం.. 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం దాడి వెనక పాక్ ఉందని భారత్ తేల్చింది. పాక్ లక్ష్యంగా దౌత్యపరమైన అన్ని సంబంధాలు తెగదెంపులు చేసుకుంది. పాక్ జాతీయులు ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.అట్టారి చెక్ పోస్టు మూసివేసింది. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 
పహల్గాం దాడుల తర్వాత ప్రధాని మోది ఉగ్రవాదాన్ని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని తరిమితరమి కొడతామని బహిరంగ ప్రతిజ్ణ చేశారు. ప్రతి ఉగ్రవాదిని , వారికి మద్దతు ఇచ్చేవారిని ట్రాక్ చేసి, శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ సరిహద్దులు దాటే దాక తరిమి కొడతామని అన్నారు.