పాకిస్థాన్ లో భారీ పేలుడు సంభవించింది. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో బ్లాస్ట్ జరిగింది. ప్రమాదంలో ముగ్గురు విదేశీయులు మరణించారు. మరో 17మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్పాట్ కు చేరుకున్న పోలీసులు..సహాయక చర్యలు చేపట్టారు. జిన్నా ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను.. పేలుడు పదార్థాలతో ఉన్న బైక్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. చనిపోయిన వారిలో ఇద్దరు చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : చెన్నై ఐఏఎఫ్ ఎయిర్ షోలో అపశ్రుతి
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan's Geo News.
— ANI (@ANI) October 7, 2024
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7