ఫాలోఆన్‌‌లో పాక్‌‌: సఫారీ టీమ్‌‌కు 421 రన్స్ ఆధిక్యం

ఫాలోఆన్‌‌లో పాక్‌‌: సఫారీ టీమ్‌‌కు 421 రన్స్ ఆధిక్యం

కేప్‌‌టౌన్‌‌: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో పాకిస్తాన్‌‌ ఫాలోఆన్‌‌లో పడింది. ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 64/3తో మూడో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 54.2 ఓవర్లలో 194 రన్స్‌‌కు ఆలౌటైంది. దాంతో సఫారీ టీమ్‌‌కు 421 రన్స్ ఆధిక్యం లభించింది.  బాబర్‌‌ ఆజమ్‌‌ (58), రిజ్వాన్ (46) కాసేపు పోరాడినా మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. రబాడ మూడు, మఫాక, కేశవ్‌‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్‌‌తో రెండో ఇన్నింగ్స్‌‌ ఆరంభించిన పాక్ మెరుగ్గా ఆడింది.

ఓపెనర్‌‌‌‌ షాన్‌‌ మసూద్ (102 బ్యాటింగ్‌‌) అజేయ సెంచరీకి తోడు బాబర్ ఆజమ్ (81) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌‌లో 213/1 స్కోరుతో మూడో రోజును ముగించింది. ప్రస్తుతం మసూద్‌‌తో పాటు ఖుర్రం షహ్‌‌జాద్‌‌ (8 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. మరో రెండు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌‌లో పాక్ ఇంకా 208 రన్స్‌‌ వెనుకంజలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా 615 రన్స్‌‌కు ఆలౌటైంది.