పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిన్స్ నరోవర్ జిల్లాలోని జఫర్యాల్ లోని బావోలీ సాహెబ్ దేవాలయాన్ని పునర్మించేందకు కోటి రూపాయిలను ( రూ. 10 మిలియన్లు)పాకిస్తాన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఆలయం 64 సంవత్సరాలుగా మూసి ఉంది. డాన్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం 1960లో ఈ దేవాలయంలో సేవలను నిలిపి వేశారు.ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించే బాధ్యతను పాకిస్థాన్ లోని మైనార్టీ ప్రార్థనా స్థలాలను పర్యవేక్షించే ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (EPTB)కు అప్పగించింది. అయితే ఈపీటీబీ ఈ దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తరువాత మూసివేశారని పాక్ ధర్మస్థాన్ కమిటి మాజీ అధ్యక్షుడు రతన్ లాల్ ఆర్య తెలిపారు.
బావోలీ సాహెబ్ దేవాలయాన్ని నిర్మించే స్థలానికి నాలుగు వైపులా ప్రహరీగోడను నిర్మించిన తరువాత పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. ఆ తర్వాత ఆలయాన్ని పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. నరోవర్ జిల్లా వ్యాప్తంగా 1,453 హిందువులు ఉన్నప్పటికి ఒక్కటి కూడా హిందూ దేవాలయం లేదు. ప్రస్తుతం నరోవర్ జిల్లాలోని హిందువులు దేవాలయానికి వెళ్లాలంటే . లాహోర్ కాని, సియాల్ కోట్ గాని వెళ్లాల్సి ఉంది. ఒకప్పుడు నరోవల్ జిల్లాలో 45 హిందూ దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.
పాకిస్థాన్ లో హిందువులు మైనార్టీ వర్గంగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 7.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారని పాక్ప్రభుత్వం అంచనాలున్నాయి. అయితే ఎక్కువ మంది హిందువులు సింధ్ ఫ్రావిన్స్ లో ఉన్నారు. హిందువులు పాకిస్థాన్లో అతిపెద్ద మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. బావోలీ సాహిబ్ హిందూ ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక హిందువుల చిరకాలవాంఛ నెరవేరుతుంది.