
రావల్పిండి: పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య గురువారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 0.2 ఓవర్లలో 2/1 స్కోరు చేసింది. తొలి ఓవర్ వేసిన షాహీన్ రెండో బాల్‌కు టిమ్ రాబిన్సన్ (0)ను డకౌట్ చేశాడు. ఈ దశలో వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపి వేశారు. తర్వాత ఐదు ఓవర్ల మ్యాచ్ ఆడించాలని ప్రయత్నించినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం ఇక్కడే జరగనుంది.