యుద్ధ మేఘాలు : నూర్ ఖాన్ ఆర్మీ బేస్ లో.. పాకిస్తాన్ యుద్ధ విమానాలు మోహరింపు

యుద్ధ మేఘాలు : నూర్ ఖాన్ ఆర్మీ బేస్ లో.. పాకిస్తాన్ యుద్ధ విమానాలు మోహరింపు

 జమ్మూ కాశ్మీర్​ లో ఉగ్రదాడి తరువాత భారత ‌– పాకిస్తాన్​ బోర్డర్​ లో  యుద్ద వాతావరణం నెలకొంది.  పాకిస్తాన్​  దేశానికి చెందిన యుద్ద విమానాలు నూర్​ ఖాన్​ బేస్​ క్యాంప్​ లో చక్కర్లు కొడుతున్నాయి.  జమ్మూకశ్మీర్‌‌‌‌లోని పహల్గామ్​ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్ అప్రమత్తమైంది. బార్డర్​లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిర్ బేసెస్​కు సమీపంలో విమానాలను మోహరించింది. కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపు ఉన్న లాహోర్, రావల్పిండి సమీపంలో ఉన్న క్యాంపులకు విమానాలను తరలించినట్లు తెలుస్తున్నది. 

ఇండియా నుంచి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రతిఘటన రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నది. దీనికి సంబంధించిన విమానాల ట్రాకింగ్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రావల్పిండిలో పాకిస్తాన్​కు అత్యంత కీలకమైన నూర్‌‌‌‌ఖాన్ బేస్ ఉంది. ఇది ఇండియా సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం.

 దాడి​తో మాకు సంబంధం లేదు:  పాకిస్తాన్

ఇదిలా ఉండగా.జమ్మూ కాశ్మీర్​లోని పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడితో తమకు సంబంధంలేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపాడు. ప్రాణనష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు. ‘‘టెర్రరిస్టుల అటాక్​లో టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. దాడుల వెనుక మా ప్రమేయం ఉందన్న వాదనను ఖండిస్తున్నాం’’ అని ఆసిఫ్ అన్నాడు. కాగా,  పహల్గామ్​ టెర్రర్ అటాక్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియాలోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ అన్నారు. ‘మృతులు, గాయపడిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తున్నది’ అని ట్వీట్ చేశారు..