- ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్లో ఘటన
పెషావర్: పాకిస్తాన్లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు, పలువురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈమేరకు శనివారం మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ నార్త్ వజీరిస్తాన్ జిల్లా స్పిన్ వామ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తున్న లెఫ్ట్ నెంట్ కల్నల్ మహమ్మద్ అలీ షౌకత్తో సహా ఐదుగురు సైనికులు మరణించారు. మరో ఆరుగురు టెర్రరిస్టులు కూడా చనిపోయారు. ఈ కాల్పులకు తామే బాధ్యత వహిస్తున్నామని నిషేధిత టెర్రరిస్టు సంస్థ తెహ్రీక్–ఈ–తాలిబాన్ (టీటీపీ) ప్రకటించుకుంది. టీటీపీ ఆర్గనైజేషన్ అఫ్గానిస్తాన్ అభయారణ్యాల నుంచి ఆపరేషన్స్ నిర్వహిస్తుందని పాక్ ఆరోపిస్తోంది. కానీ, ఈ ఆరోపణలను అఫ్గాన్ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం కొట్టిపారేసింది.