
శ్రీనగర్: ఇండియా-పాక్ బార్డర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం (ఏప్రిల్ 1) జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి ప్రాంతంలో కొందరు దుండగులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో భారత ఆర్మీపై చొరబాటుదారులు, పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం సీజ్ ఫైర్ ఉల్లంఘించి కాల్పులు జరపడంతో భారత సైన్యం కూడా ధీటుగా బదులిచ్చింది.
తిరిగి పాక్ సైన్యం, చొరబాటుదారులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో నలుగురు, ఐదుగురు చొరబాటుదారులు మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని అధికారులు ఇంకా ధృవీకరించ లేదు. ఘటన స్థలంలో కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణ ఘాటి ప్రాంతంలో సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.