ఆటలో దేవుడు : క్రికెట్ మ్యాచ్ మధ్యలో నమాజ్ చేసిన పాకిస్తాన్ వికెట్ కీపర్


హైదరాబాద్‌లోని ఉప్పల్ లో నెదర్లాండ్స్ తో జరిగిన  మ్యాచ్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ స్టేడియంలో  నమాజ్ చేశాడు.  ఆట మధ్యలో డ్రింక్స్ టైమ్ లో  అతను  నమాజ్ చేశాడు.  మ్యాచ్‌లో రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. అతను గతంలో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా   మైదానంలో నమాజ్ చేస్తూ కనిపించాడు. రిజ్వాన్ నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్  కావడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.   

రిజ్వాన్ క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాడా లేకా  ప్రచారం చేయడానికి  వచ్చాడా అంటూ కొందరు ట్వీట్ చేస్తుంటే మరికొందరేమో ..  క్రికెట్ లో  రిజ్వాన్ మతాన్ని కలుపుతునాడని, భారతీయులు తనను గమనిస్తున్నప్పుడు అతను ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తాడని కామెంట్ చేస్తున్నారు.  కాగా ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను 205 పరుగులకు ఆలౌట్ చేయడంతో పాక్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది.