
పాకిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది.గత మూడు రోజులుగా రోజుకో ప్రాంతంలో పేలుళ్లు జరుగుతున్నాయి. ఆదివారం (మార్చి 16) పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ నౌషి ప్రాంతంలో భద్రతా దళాలు వెళ్తున్న బస్సుపై బాంబు దాడి జరిగింది.ఈ దాడిలో ఐదుగురు సైనికులు చనిపోయారు. మరో 10మంది గాయాపడ్డారు. బలూచిస్తాన్ లోని నౌష్కి జిల్లాల్లో ఈ దాడి జరిగింది. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే పేలుళ్లకు ఎవరూ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ పనే అయి ఉంటుందని అధికారులుచెబుతున్నారు. వారం రోజుల క్రితం రైలుపై మెరుపు దాడి చేసిన బలూచ్ లిబరేషన్ అర్మీ.. 400 మందిని బందీలుగా పట్టుకుంది.. వారిలో 26 మంది బందీలను చంపారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ దళాలు 33మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులను హతమార్చారు.
Also Read:-ఉత్తర మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం..51మంది మృతి
చమురు,ఖనిజాలు అధికంగా ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ,అత్యల్ప జనాభా కలిగిన ప్రావిన్స్. కేంద్ర ప్రభుత్వం తమపై వివక్ష చూపిస్తున్నారని బలూచ్ జాతీయులు ఆరోపిస్తున్న క్రమంలో ప్రత్యేక బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ బలూచ్ ప్రజల ఆరోపణలను ఖండిస్తోంది.