కొలంబో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పాకిస్తాన్ నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లోనూ ఇన్నింగ్స్ 222 రన్స్ తేడాతో శ్రీలంకపై భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2–-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 563/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 134 ఓవర్లలో 576/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆగా సల్మాన్ (132 నాటౌట్), రిజ్వాన్ (50 నాటౌట్) రాణించారు.
ALSO READ :3 బోర్డులు ఐసీసీకి లేఖ రాశాయి: జై షా
ఫెర్నాండో 3, జయసూరియా 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్లలో 188 రన్స్‌కే కుప్పకూలింది. ఎంజెలో మాథ్యూస్ (63), దిముత్ కరుణరత్నె (41) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. పాక్ స్పిన్నర్ నోమాన్ అలీ 7 వికెట్లతో లంక ఇన్నింగ్స్‌ను కూల్చాడు. అబ్దుల్లా షఫీక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఆగా సల్మాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సిరీస్ విక్టరీతో పాకిస్తాన్ (100 పర్సంటైల్) వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.