రావల్పిండి: పాకిస్తాన్‌తో గురువారం మొదలైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో తడబడింది. స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (6/128), నోమన్ అలీ (3/88) టర్నింగ్ మ్యాజిక్ చేయడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 68.2 ఓవర్లలో 267 రన్స్‌కు ఆలౌటైంది. జెమీ స్మిత్ (89), బెన్ డకెట్ (52) హాఫ్ సెంచరీలు చేయగా, గస్ అట్కిన్సన్ (39), జాక్ క్రాలీ (29) ఫర్వాలేదనిపించారు.
ఇన్నింగ్స్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 73/3 స్కోరు చేసింది. షాన్ మసూద్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ (14), సైమ్ అయూబ్ (19), కమ్రాన్ గులామ్ (3) విఫలమయ్యారు. లీచ్, అట్కిన్సన్, బషీర్ తలా వికెట్ తీశారు. ప్రస్తుతం పాక్ ఇంకా 194 రన్స్ వెనకబడి ఉంది.