IND Vs PAK: టీమిండియా ప్లాన్ మాకు తెలుసు.. మా మ్యాచ్ విన్నర్లు వారే : పాక్ కోచ్

IND Vs PAK: టీమిండియా ప్లాన్ మాకు తెలుసు.. మా మ్యాచ్ విన్నర్లు వారే : పాక్ కోచ్

భారత్, పాకిస్థాన్ ల మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. దుబాయ్ లో అద్భుత రికార్డ్ ఉన్న పాకిస్థాన్ ను తేలికగా తీసుకుంటే ప్రమాదమే. ఈ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ కోచ్ ఆకీబ్ జావేద్ తమ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని చెప్పాడు. భారత్ ప్లాన్ తమకు తెలుసని.. తమ జట్టులో మ్యాచ్ వినర్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చాడు. 

ఆకీబ్ జావేద్ మాట్లాడుతూ.. " మా జట్టుతో పోలిస్తే ఇతర జట్లలో చాలా మంది స్పిన్నర్లు ఉన్నారు. మాకు తక్కువ స్పిన్నర్లు తక్కువగా ఉన్నారు. జట్లు వారి స్వంత బలంతో తమ ఆటను ఆడతాయి. మాకు ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఈ రోజు జరిగే ఆటలో లో షాహీన్, నసీమ్, హారిస్‌తో మా జట్టు బలం. వీరు ముగ్గురు ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు. మా జట్టు ఫాస్ట్ బౌలింగ్ చూస్తుంటే నాకు 90ల కాలం గుర్తుకొస్తుంది. ఇండియా 3-4 స్పిన్నర్లను ఆడాలనే ప్లాన్ తో ఉన్నారు. మేము మా స్వంత బలంతో మా క్రికెట్ ఆడాలి. మా జట్టులో పెద్దగా ఎలాంటి మార్పులు కనిపించవు. అని జావేద్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో అన్నారు.

బంగ్లాదేశ్‌‌పై భారీ విజయంతో చాంపియన్స్ ట్రోఫీ వేటను ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ బెర్తుపై గురి పెట్టింది.గ్రూప్‌‌–ఎలో భాగంగా ఆదివారం ఇక్కడి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌ స్టేడియంలో జరిగే మెగా మ్యాచ్‌‌లో పాకిస్తాన్‌‌తో గెలిస్తే రోహిత్‌‌సేన సెమీఫైనల్‌‌ చేరుకోనుంది. ఈ పోరులో ఓడితే మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్సీలోని పాక్‌‌ గ్రూప్‌‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు చివరగా 2017 టోర్నీ ఫైనల్లో తలపడ్డాయి. నాడు లండన్‌‌లో టీమిండియాను ఓడించిన పాక్‌‌ ట్రోఫీ సొంతం చేసుకుంది.