Pakistan Cricket: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ టెస్ట్ స్క్వాడ్ ప్రకటన

Pakistan Cricket: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ టెస్ట్ స్క్వాడ్ ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీకి మరో నెల రోజులు సమయం ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ప్రకటించకుండా వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా వెస్టిండీస్‌తో పాకిస్థాన్ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు  శనివారం (జనవరి 11) 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది.

దక్షిణాఫ్రికాలో ఇటీవలే పర్యటించిన టెస్ట్ స్క్వాడ్ లో ఏకంగా ఏడు మార్పులు చోటు చేసుకున్నాయి. రిటైన్ చేయబడిన ఆటగాళ్లలో షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మహ్మద్ రిజ్వాన్, నోమన్ అలీ, సల్మాన్ అలీ అఘా ఉన్నారు. స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్, మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌లతో పాటు నోమన్ అలీకి చోటు దక్కింది. 

ALSO READ | KL Rahul: రాహుల్ విషయంలో మనసు మార్చుకున్న బీసీసీఐ.. కారణమిదే

గాయపడిన సైమ్ అయూబ్, ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్ స్థానంలో ఓపెనర్లు ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హురైరాలను ఎంపిక చేశారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ కారణంగా అమీర్ జమాల్, మహ్మద్ అబ్బాస్, మీర్ హమ్జా, నసీమ్ షాల పేస్ త్రయానికి రెస్ట్ ఇచ్చింది. జనవరి 17 నుంచి 21 వరకు మొదటి టెస్ట్.. జనవరి 25-29 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. రెండు టెస్టులు ముల్తాన్ వేదికగా జరుగుతాయి. 

పాకిస్థాన్ జట్టు:

షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, కమ్రాన్ గులామ్, కాషిఫ్ అలీ, ఖుర్రం షాజాద్, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్/బ్యాటర్), నోమన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్/బ్యాటర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా.