జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 కోసం విదేశీ కోచ్‌లు, సహాయక సిబ్బందిని నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చూస్తోంది. వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్‌లో వరుస మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ తర్వాత పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాబర్ అజామ్ మూడు ఫార్మాట్‌ల నుండి వైదొలిగాడు.
జాతీయ జట్టుకు మార్గనిర్దేశం చేయడానికి కొత్త ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) విదేశీ కోచ్‌లు సహాయక సిబ్బందిని నియమించాలని చూస్తోందని పీసీబీ PTI తెలిపినట్టు సమాచారం. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్‌లను తొలగించిన విధానం కారణంగా విదేశీ కోచ్‌లు పాకిస్థాన్ జట్టులో చేరేందుకు ఇష్టపడరు కాబట్టి.. అందుబాటులో ఉన్న కొంతమంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయమని నఖ్వీ ఇప్పటికే చీఫ్ సెలెక్టర్, వాహబ్ రియాజ్‌ను కోరాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్ జట్టు ఘోరంగా ఓడిపోవడంతో.. పీసీబీ ఇటీవల మొహమ్మద్ హఫీజ్‌ను క్రికెట్ డైరెక్టర్ నుండి తొలగించారు. ఆస్ట్రేలియాతో 3-0 వైట్‌వాష్ కావడంతో పాటు కివీస్ తో 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-4 తేడాతో ఓడిపోయింది. మార్చి చివరి నాటికి పాకిస్థాన్ బోర్డులో, జట్టులో అనేక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కొన్ని వర్గాలు తెలియజేస్తున్నాయి.