Champions Trophy 2025: కళకళలాడుతున్న కరాచీ.. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నీ

Champions Trophy 2025: కళకళలాడుతున్న కరాచీ.. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నీ

ఐసీసీ టోర్నీ అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ దేశాల్లో క్రికెట్ క్రేజ్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం.  సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంకలో అరుదుగా ఐసీసీ టోర్నీ నిర్వహించడం చూస్తాం. కానీ పాకిస్థాన్ లో మాత్రం ఒక ఐసీసీ టోర్నీ జరపడానికి క్రికెట్ అధికారులు ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం లేకపోలేదు. పాకిస్థాన్ లో భద్రత కారణం ఒకటైతే ఐసీసీ టోర్నీ నిర్వహించే ప్రమాణాలు ఆ దేశంలో లేకపోవడమే. 

1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ టోర్నీకి ఆతిధ్యమిస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ టోర్నీని నిర్వహించడం విశేషం. 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరాగాల్సి ఉంది. కానీ ఆ సంవత్సరం లాహోర్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరిగింది. ఈ భయంకరమైన ఘటనతో ఛాంపియన్స్ ట్రోఫీని సౌతాఫ్రికాకు తరలించారు. 29 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ లో ఐసీసీ టోర్నీ జరగనుండడంతో ఆ దేశం కలకాలాడుతుంది. 

ALSO READ : Champions Trophy 2025: 12000 మందికి పైగా పోలీసు అధికారులు.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారీ భద్రత

పాకిస్థాన్ లో ఒక్కసారిగా క్రికెట్ ఫీవర్ మోగిపోతుంది. అభిమానులు తొలి మ్యాచ్ కు ముందు తెగ సందడి చేస్తున్నారు. బుధవారం (ఫిబ్రవరి 19) న్యూజిలాండ్ తో ఆతిధ్య పాకిస్థాన్ టోర్నీ తొలి మ్యాచ్ ఆడదానికి సిద్ధంగా ఉంది. సొంత గడ్డ కావడంతో ఈ మ్యాచ్ కు పాకిస్థాన్ భారీగా సపోర్ట్ ఉండనుంది. ఈ మ్యాచ్ కు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కరాచీతో  పాటు లాహోర్, రావల్పిండిలో మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 29 ఏళ్ళ తర్వాత ఐసీసీ ఈవెంట్ పాకిస్థాన్ లో చివరికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.