Pakistan Cricket: పాకిస్థాన్ దేశమూ, వారి జట్టు రెండూ ఒక్కటే.. అందరిదీ ఒకే రేఖ: భారత మాజీ సెటైర్లు

Pakistan Cricket: పాకిస్థాన్ దేశమూ, వారి జట్టు రెండూ ఒక్కటే.. అందరిదీ ఒకే రేఖ: భారత మాజీ సెటైర్లు

దాయాది పాకిస్థాన్ క్రికెటర్లు ఎప్పుడు.. ఎలా ఆడతారో చెప్పడం కష్టం. అస్థిరతకు మరో పేరు.. ఆ జట్టు. జింబాబ్వే, ఆఫ్గనిస్తాన్, అమెరికా వంటి చిన్న జట్ల చేతిలో ఓడటం.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై అలవోకగా విజయాలు సాధించడం అందుకు కొన్ని ఉదాహరణలు. దాయాది జట్టు ఈ ప్రదర్శన పట్ల భారత మాజీ ఆకాశ్ చోప్రా సెటైర్లు వేశారు.   

ఇటీవల ముగిసిన ట్రై సిరీస్‌లో పాక్ జట్టు.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సొంతగడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పింది. అనంతరం ఒకరోజు గ్యాప్‌లోనే న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. కివీస్‌తో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో పాక్ బ్యాటర్లు పూర్తిగా 50 ఓవర్లు ఆడలేకపోయారు. ఇదే ఆ జట్టును కలవర పరుస్తోంది. నిలకడగా రాణించడం ఎలా అన్న దానిపై మాజీల చేత పాఠాలు వింటున్నారు. 

దీనిపై స్పందించిన ఆకాష్ చోప్రా.. పాకిస్తాన్ బలహీనత ఇప్పటిది కాదని, అది శాశ్వత బలహీనత అని జోకులు పేల్చారు. ఇప్పటితరం వారు మునుపటి తరపు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని సెటైర్లు వేశారు. 

ALSO READ | Ajinkya Rahane: ఫైనల్లో బాగా ఆడినా తప్పించడం బాధించింది.. సెలక్టర్లపై రహానే విమర్శలు

"పాకిస్తాన్ బలహీనత ఈనాటి బలహీనత కాదు. అది శాశ్వత బలహీనత. మునపటి తరం జయాపజయాలను వారు కొనసాగిస్తున్నారు అంతే. ఆ టీమ్ గత చరిత్ర అటువంటిదే. వారి గ్రాఫ్ పైకి క్రిందికి వెళ్తుంటుంది. వారందరికీ అరుదుగా ఒకే రేఖ ఉంటుంది. వారు బహుశా వారి దేశం లాగానే ఉంటారు. వారి దేశం కూడా అలాగే పైకి క్రిందికి వెళ్తుంది.."

"ఛాంపియన్స్ ట్రోఫీలో వారు డిఫెండింగ్ ఛాంపియన్లు కావొచ్చు. కానీ ఇప్పుడు జరగబోయే టోర్నీలోఏ మేరకు రాణించగలం అనేది వారికే తెలియదు. గడిచిన(2024) ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో అమెరికా చేతిలో ఓడారు. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టారు. ఈసారి టోర్నీ సొంతగడ్డపై జరుగుతోంది కనుక కాస్త మంచి ప్రదర్శనే చేయొచ్చు. కానీ, టైటిల్ గెలవాలనుకోవడం అత్యాశ అవుతుంది.." అని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారిస్ రౌఫ్, మహ్మద్ హస్ నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.