వన్డే ప్రపంచకప్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే కంగారూల గడ్డపై పాక్ క్రికెటర్లు.. ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. డిసెంబర్ 14 నుంచి ఈ సిరీస్ ప్రధాన మ్యాచ్‌లు షురూ కానున్నాయి. ఇదిలావుంటే, పాక్ క్రికెటర్లు మంగళవారం ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో సందడి చేశారు.
కాన్‌బెర్రాలో ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పార్లమెంట్ హౌస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు హాజరైంది. కాసేపు వారందరూ ఆసీస్ ప్రధానితో ముచ్చటించారు. అనంతరం పార్లమెంట్ హౌస్ ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పాక్ క్రికెటర్లు ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌ను సందర్శించడంపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలు గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో గోధుమ పిండి ప్యాకెట్లు తెచ్చుకోవడానికి వెళ్లారని మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
Pakistan cricket team hosted at Parliament House, Canberra by Australian Prime Minister Anthony Albanese.#AUSvPAK pic.twitter.com/cbQzlYpZAz
— Pakistan Cricket (@TheRealPCB) December 5, 2023
వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజాం తప్పుకోవడంతో.. ఈ సిరీస్ కు షాన్ మసూద్ కెప్టెన్‌గా నాయకత్వం వహించనున్నాడు.
పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా షెడ్యూల్
- తొలి టెస్టు (డిసెంబర్ 14-1)8: పెర్త్
- రెండో టెస్ట్ (డిసెంబర్ 26-30): మెల్ బోర్న్
- మూడో టెస్ట్ (జనవరి 3-7): సిడ్నీ