
క్రైస్ట్ చర్చ్: చాంపియన్స్ ట్రోఫీలో చెత్తాటతో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు టీ20ల్లో కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో బరిలోకి దిగిన తొలి పోరులోనే చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ 18.4 ఓవర్లలో 91 రన్స్‌కే కుప్పకూలింది.
కివీస్ బౌలర్లు జేకబ్ డఫీ (4/14), కైల్ జెమీసన్ (3/8) దెబ్బకు ఈ ఫార్మాట్‌లో తమ ఐదో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కుష్దిల్ షా (32), కెప్టెన్ సల్మాన్ అఘా (18), జహందాద్ ఖాన్ (17) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. అనంతరం కివీస్ 10.1 ఓవర్లలోనే 92/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. టిమ్ సీఫర్ట్ (44 ) సత్తాచాటాడు. రెండో మ్యాచ్ మంగళవారం డనిడిన్‌లో జరుగుతుంది